కొత్తపేట: భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం
వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. వాడపల్లి దేవస్థానం వద్ద పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు.