చికిత్స పొందుతూ యువకుడు మృతి
పురుగుల మందు సేవించిన యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన కరపోతు లక్ష్మీ ప్రవీణ్ అజయ్( 22 ) గత నెల 25వ తేదీన జీవితం మీద వెరక్తి చెంది పురుగుల మందు సేవించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.