కొవ్వూరు గోష్ప్రద క్షేత్రంలో స్నాన ఘట్టంలో నీటిలో తెలియాడుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం శుక్రవారం తెలిపారు. మృతుడి వయసు 60 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఒంటిపై తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు. ఆచూకీ తెలిసినవారు కొవ్వూరు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.