చాగల్లు గ్రామంలో ఉన్న మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ 50వ వార్షికోత్సవ ఏర్పాట్లు పూర్తయినట్లు కమిటీ సభ్యులు లక్కోజు వెంకటేశ్వరరావు బుధవారం తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ శనివారం కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వీరబ్రహ్మేంద్రస్వామి ఎనిమిదో తరం మునిమనవడు వీరభద్ర స్వాములు దంపతులు హాజరవుతారని తెలియజేశారు. కావున భక్తులు అందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయ వంతం చేయాలని కమిటీ పెద్దలు కోరారు.