చాగల్లు మండల పరిషత్ కార్యాలయంలో డయేరియా మరియు ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీఓ నాతి బుజ్జి ఆద్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశంశనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో అన్ని రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులను శుభ్రపరచడం,త్రాగునీటి క్లోరినేషన్,పారిశుధ్యం మెరుగు పరచడానికి అవసరమైన సిబ్బందిని సామాగ్రిని సమకూర్చుకోవాలని గ్రామ పంచాయతీలకు సూచించారు.