దుద్దుకూరు గ్రామంలో 13వ వార్డులో వీధి కుక్కల బెడదతో వణుకుతోంది. మంగళవారం కొత్తపేటలో అత్యంత దారుణంగా వీధి కుక్కలు కరిచి చంపేస్తున్నాయి. గడచిన నెలల్లో ఎన్నో ఘటనలు జరిగాయి. ఇంకా ఎంతోమంది గాయపడ్డారు. గ్రామంలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చిన్నారులు కనిపిస్తే చాలు దాడి చేస్తున్నాయి. వాహనదారులను వెంటపడి భయపెడుతున్నాయి. స్థానిక ప్రజలు, గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.