రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం కొవ్వూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.