చాగల్లు మండలం మల్లవరం గ్రామానికి చెందిన కొటారు రత్నంకి సీఎం సహాయనిది నుండి రూ. 81, 000 మంజూరు అయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.