కొవ్వూరు మండల న్యాయ సేవ సంస్థల అద్వర్యంలో 9వ అదనపు జిల్లా జడ్జి ఎం. అనురాధ ఓ ఫైనాన్స్ సహకారంతో శుక్రవారం సాయంత్రం హెల్మెట్లు పంపిణీ చేశారు. కొవ్వూరు జిల్లా కోర్ట్ హాల్‌లో 20 మంది ద్విచక్రవాహన దారులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అనురాధ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిన ప్రాణాపాయం ఉండదన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధరించాలన్నారు.