కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ హాజరు పట్టీని పరిశీలించారు. ఇన్ పేషెంట్ విభాగంలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అన్ని విధాల ఆసుపత్రిలో సౌకర్యాలు ఉన్నందున కేసులను రిఫర్ చేసే ముందు జాగ్రత్త వహించాలని ఆర్డీవో సూచించారు.