ప్రజలు సకాలంలో మున్సిపాలిటీ పన్నులు చెల్లించినట్లయితే మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందని రీజనల్ డైరెక్టర్ కామ్ ఆప్టిలేట్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అన్నారు. శుక్రవారం కొవ్వూరులో లీటరరీ క్లబ్ లో కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలలోని ఆరు మున్సిపాలిటీల అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 మున్సిపాలిటీల మునిసిపల్ కమిషనర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు