వేసవికాలంలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ప్రతి గ్రామంలో చెట్లను నాటాలని పెద్దవం గ్రామ ఉపసర్పంచ్ తోట రామకృష్ణ అన్నారు ఈరోజు పెద్దవం గ్రామంలో బీట్ ది హీట్ అనే కార్యక్రమం చేపట్టారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలందరికీ ఉందని పెద్దేవం గ్రామంలో ప్రజలందరూ విధిగా మొక్కలు నాటి భవిష్యత్ తరాల కైనా వేసవి తాపం లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సాంబమూర్తి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.