తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో సుమారు రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డుకు శుక్కవారం గ్రామ సర్పంచ్ తెగిరిపల్లి వెంకట్రావు, ఉప సర్పంచ్ తోట రామకృష్ణ, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు తదితరులు శంకుస్థాపన చేశారు. కోట సోమేశ్వరరావు ఇంటి వద్ద నుండి జమ్ముల గోపాలరావు ఇంటి వరకు సిసి రోడ్ నిర్మాణం జరుగుతుందని గ్రామ ఉపసర్పంచ్ తోట రామకృష్ణ తెలిపారు. ఈ రోడ్డు అతి త్వరలో పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని తెలిపారు.