కొవ్వూరు నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు

61చూసినవారు
కొవ్వూరు నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు
కొవ్వూరు ఆర్టీసీ డిపో నుంచి సోమవారం క్రైస్తవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బయలుదేరి వెళ్లింది. ఇప్పటివరకు క్రైస్తవ పుణ్యక్షేత్రాలకు 2 బస్సులను నడిపినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వై. వి. వి. ఎన్ కుమార్ తెలిపారు. ఈ నెలలో కుంభమేళాకు ఒక బస్సును పంపించినట్లు ఆయన వివరించారు. క్షేత్ర దర్శని పేరుతో కొవ్వూరు డిపో నుంచి హిందూ, క్రిస్టియన్, ముస్లిం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు పంపుతున్నట్లు తెలిపారు.