దేవరపల్లి మండలం త్యాజంపూడి సర్పంచ్ కుసుమూరు స్వరూపారాణి జన్మదిన వేడుకలు పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉపసర్పంచ్ కుసుమూరు సతీష్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.