విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై దాడులు చేయడం అమానుషమని వైకాపా మైనార్టీ నాయకులు షేక్ అలీ ఖాన్ బాబా శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి రు. 430 కోట్లతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, విగ్రహం శిలాఫలకంపై ఉన్న వైయస్ జగన్ పేరును తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.