తూ. గో జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు సోమవారం కడియం మండలంలోని దుళ్ళ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా సమగ్ర భూ సర్వే అంశాలపై ఆరా చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ నందు సమావేశం నిర్వహించి, స్థానిక సర్వేలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.