సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజుని పట్టణంలో మహేష్ అభిమానులు మండపేట కలవపువ్వుసెంటర్ వద్ద బాబ్జి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాబ్జి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. మహేష్ బాబు సేవ సమితి ప్రెసిడెంట్ షేక్ బాబ్జి మాట్లాడుతూ 200మంది నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో విజ్ఞాన్ బాబీ తదితరులు పాల్గున్నారు.