మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఓ వివాహ వేడుకలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. వరుడు శీరపు జగదీష్ గ్రాడ్యుయేట్. ఆయన ఓటు అభ్యర్థించేందుకు కళ్యాణ మండపానికి స్థానిక కూటమి నాయకులు చేరుకున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని గెలిపించాలని కరపత్రం అందించారు. బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.