రౌతులపూడి మండలం ఎన్ ఎన్ పట్నంలో గత మూడు నెలలుగా ఉపాధి పనులు కల్పించడం లేదంటూ శుక్రవారం కూలీలు ఆందోళన చేశారు. ఆడిట్ పేరుతో పనులు నిలిపివేశారని వారు ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు పని కల్పించాలని వారు కోరుతున్నారు. ఇదే విషయంపై ఏపీఓ మాట్లాడుతూ పనులు గుర్తించామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కూలీలు మాత్రం పనులు లేవని వాపోతున్నారు.