మండపేట తహశీల్దార్ గా పి తేజేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కలక్టరేట్ ఏవోగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడకు వచ్చారు. ప్రస్తుత తహసిల్దార్ సురేష్ కుమార్ సొంత జిల్లాకు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా నూతన తహసిల్దార్ కు డిటి అశోక్, ఎన్నికల డిటి బాబా, సిబ్బంది, విఆర్ఓలు స్వాగతం పలికారు.