పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన యానాంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు యానాం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఏఆర్వో మునిస్వామి సోమవారం తెలిపారు. మంగళవారం ఉ. 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు తరలించి 7: 30 లోపు తెరుస్తామన్నారు. లెక్కింపునకు 10 టేబుల్స్ ఏర్పాటు చేశామని, 3 విడతల్లో 30 పోలింగ్ బూత్ లు, 4వ విడతలో మిగిలిన 3 బూత్ ల ఓట్లు లెక్కిస్తామన్నారు.