పి. గన్నవరంలోని గ్రేస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం భారీ జాతీయ జెండా తో ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ జరిగింది. తొలుత కళాశాల వద్ద విద్యార్థులు, అధ్యాపకులు జెండా వందనం నిర్వహించారు. కందాల పాలెం జెరూసలేం ప్రార్థన మందిరం పాస్టర్ జి. డానియల్ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన ఈ ర్యాలి కళాశాల నుండి ప్రధాన రహదారి మీదుగా పి. గన్నవరం కొత్త బ్రిడ్జి వరకు సాగింది.