బాలికపై అత్యాచార యత్నం

80చూసినవారు
బాలికపై అత్యాచార యత్నం
కాట్రేనికోన మం. చిర్రయానం సమీపంలో ఈ నెల 12న ఏడేళ్ల బాలికపై పినపోతు సత్తిబాబు (30) అనే వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బి. నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం బాలిక పాఠశాలకు వెళుతుండగా మార్గం మధ్యలో సత్తిబాబు అడ్డగించి అత్యాచార యత్నం చేశాడు.
బాలిక కేకలు వేయడంతో కొందరు యువకులు వచ్చి కామాంధుడికి దేహశుద్ధి చేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేశామన్నారు.