దిగబడిపోతున్న ఏటిగట్టు అప్రోచ్ రోడ్డు

57చూసినవారు
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి నుంచి పల్లంకుర్రు వరకు ఏటిగట్టు రోడ్డును ఇటీవల అభివృద్ధి చేశారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన అప్రోచ్ దిగబడిపోయింది. కుండలేశ్వరం స్నానఘట్టం సమీపంలో 60 మీటర్ల మేర ఏటిగట్టు అప్రోచ్ రోడ్డు కాలువ పక్క కుంగి పోయింది. దీనికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించినా ప్రయోజనం లేదు. సరుగుడు కర్రలు, వెదురు తడకలతో రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్