ఐ. పోలవరం మండలం ఎర్రగరువు గ్రామంలో ఆస్తి సరిహద్దు తగాదాల్లో మంగళవారం ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలపై ఒక వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసాడు. క్షతగాత్రులు జి. సత్యనారాయణ, ఆయన భార్యను స్థానికులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐ. పోలవరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.