ఐ. పోలవరం మండలం మురమళ్ల గ్రామంలోని శ్రీవీరేశ్వర స్వామివారి నిత్య కళ్యాణం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పూజా కైంకర్యాలను నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో లక్ష్మీనారాయణ ఏర్పాట్లు చేశారు.