ఐ. పోలవరం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు నాదస్వరం, సన్నాయి మేళం, గరగ డాన్స్, తంబుర వాయిద్యాలతో ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.