సామాజిక పింఛన్లలో బదిలీ ఆప్షన్ ఓపెన్ అయిందని మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఒక సచివాలయం నుండి మరో సచివాలయానికి పింఛన్లను బదిలీ చేసుకోవచ్చు అని వివరించారు. కాగా ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న సచివాలయంలోని వెల్ఫేర్ అధికారులకు తెలియజేసి దానికి సంబంధించిన చర్యలను తీసుకోవాలని మంత్రి సూచించారు.