తల్లిదండ్రులకు బాలికల అప్పగింత
ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అనపర్తికి చెందిన ఇద్దరు బాలికలను నిడదవోలు రైల్వే పోలీసులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాచూరి మేరీతో పాటు మరో బాలిక ఇంటి వద్ద తల్లిదండ్రులు తిట్టారనే కోపంతో రైలు ఎక్కి నిడదవోలు రైల్వే స్టేషన్లో దిగారు. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.