సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాలు మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పండగ వాతావరణం లో జరిగింది. కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితోపాటు తెలుగుదేశం మరియు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్నికలనాటి హామీ మేరకు 3000 పెన్షన్ 4000 చేసి ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు చల్లా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.