సామర్లకోట మునిసిపాలిటీ లో పారిశుధ్యం కోసం పనిచేస్తున్న ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడడమే గాక వారికి పనిముట్లు కొనుగోలులో సైతం అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని వైసీపీ కౌన్సిలర్ చల్లపల్లి శ్రీను ఆరోపణలు చేసారు. సామర్లకోట మునిసిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం ఛైర్పర్శన్ జీ. అరుణ అధ్యక్షతన నిర్వహించారు. అధికారులపై ఆరోపణలు చేసినప్పటికీ అటు అధికారుల నుంచి స్పందన లేకపోయింది.