పెద్దాపురం: ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం షాపులు లాటరీ వాయిదా

56చూసినవారు
పెద్దాపురం: ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం షాపులు లాటరీ వాయిదా
పెద్దాపురం ఎక్సైజ్ పరిధిలో గీత కులాలకు మద్య షాపుల కేటాయింపుకు సంబంధించిన లాటరీ వాయిదా పడినట్లు ఎక్సైజ్ సీఐ అర్జున్ రావు తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దాపురం -1, గండేపల్లి - 1, జగ్గంపేట -1 మొత్తం మూడు షాప్లకు సోమవారం లాటరీ తీయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేస్తున్నామన్నారు. త్వరలోనే వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్