పెద్దాపురం: ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష

57చూసినవారు
పెద్దాపురం: ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయ 9, 11 తరగతులలో ప్రవేశానికి శనివారం పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలను పెద్దాపురం తహశీల్దార్ సీహెచ్ వెంకట లక్ష్మి పర్యవేక్షించారు. పెద్దాపురంలోని లెమ్స్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 1, 451 మంది, 11 తరగతి ప్రవేశ పరీక్షకు 699 మంది దరఖాస్తు చేసుకున్నారు. పెద్దాపురంలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్