పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కూటమి నేతలు కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు. సామర్లకోటలో ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సోమవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని ఆదేశించారు. అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, కంటే జగదీశ్ మోహన్, పడాల వీరబాబు, నిమ్మకాయల కిరణ్ పాల్గొన్నారు.