పెద్దాపురం స్టేషన్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

56చూసినవారు
పెద్దాపురం స్టేషన్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బిందు మాధవ్ పెద్దాపురం పోలీస్ స్టేషన్ కు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టేషన్లో రికార్డులను ఎస్పీ పరిశీలించారు. ఎస్పీ ఆకస్మిక పర్యటనలో భాగంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డిజిటల్ అరెస్టులు లేవని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్