పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గొల్లప్రోలులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దారు సత్యనారాయణ తెలిపారు. పాఠశాలలోని గదులను ఆదివారం పరిశీలించినట్లు చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 750 మంది చొప్పున ఓటుహక్కు ఉపయోగించుకునేలా నిర్ణయించామన్నారు. గొల్లప్రోలులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు కోసం 1, 650 దరఖాస్తులు వచ్చాయన్నారు.