ఈ-శ్రమ్ పోర్టల్లో ఉచితంగా నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం అందించే విభిన్న అసంఘటిత కార్మికులందరూ భద్రత పొందాలని పిఠాపురం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బుల్లిరాణి సూచించారు. బుధవారం సాయంత్రం గొల్లప్రోలు పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వద్ద అసంఘటిత కార్మికులకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ-శ్రమ్ నమోదుకు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య కార్మికులు అర్హులని తెలిపారు.