గొల్లప్రోలు: డీలర్ ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

63చూసినవారు
గొల్లప్రోలు: డీలర్ ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ
గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో మండలంలోని గ్రామాల్లో ఖాళీగా ఉన్న 7 చౌకధరల దుకాణాల డీలర్ ల నియామకానికి జనవరి 8వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. చెందుర్తి, చేబ్రోలులో రెండు చొప్పున, గొల్లప్రోలు, కొడవలి, తాటిపర్తిలో ఒక్కొక్క చౌకధరల దుకాణాల డీలర్ ల స్థానాలు ఖాళీలున్నట్లు చెప్పారు. దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయం లేదా కాకినాడలో ఆర్డీవో కార్యాలయంలో అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్