గొల్లప్రోలు మండలంలో రైతు సేవ కేంద్రాల్లో శుక్రవారం సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. తాటిపర్తి గ్రామంలో రైతులకు ఎలుకలకు మందు ఏవిధంగా కలపాలి, మందు పెట్టే విధానం, తీసుకోవాల్సిన చర్యలు గురించి పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి. స్వాతి , మండల వ్యవసాయ అధికారి కె. వి. వి. సత్యనారాయణ తెలియజేసారు. ఎలుకల నిర్మూలనకు బ్రోమో డైలిన్ మందును అందుబాటులో ఉన్న రైతుసేవ కేంద్రం నుండి తీసుకోవాలని కోరారు.