గొల్లప్రోలు మండల పరిధి దుర్గాడ గ్రామ శివారు ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు గొల్లప్రోలు ఎస్ఐ ఎన్. రామక ష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పేకాట స్థావరంపై దాడిచేశారు. జూదం ఆడుతున్న అబ్బాయి, నూకరాజును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇరువురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు.