గొల్లప్రోలు నగరపంచాయతీ కమిషనర్ గా నామా కనకారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ కమిషనర్ గా పనిచేసిన టి. రవికుమార్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. తాజాగా పిఠాపురం మన్సిపల్ కమిషనర్ గా ఉన్న కనకారావుకు గొల్లప్రోలు కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎం. హరినారాయణన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు.