పిఠాపురం: కుక్కుటేశుని ఆలయంలో పందిరి రాట మహోత్సవం

66చూసినవారు
పిఠాపురం: కుక్కుటేశుని ఆలయంలో పందిరి రాట మహోత్సవం
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ నందలి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పందిరి రాట మహోత్సవం ఆలయ వేద పండితుల చేతుల మీద శాస్త్రోక్తంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాలు మొదటి అంకంలో భాగంగా పందిరిలాట వేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్