పిఠాపురంలో అభివృద్ధి పనులపై పీడీ సమీక్ష

61చూసినవారు
పిఠాపురంలో అభివృద్ధి పనులపై పీడీ సమీక్ష
పిఠాపురంలో తాహశీల్దార్ కార్యాలయంలో పాడా పీడీ శ్రీధర్ మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జరుగుతున్న పనులను అధికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పాడా కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి మున్సిపాలిటీకి చెందిన భవనాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్