పిఠాపురం: అలరించిన సంగీత గాత్రకచేరి

54చూసినవారు
పిఠాపురం: అలరించిన సంగీత గాత్రకచేరి
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో స్థానిక అగ్రహారంలో గల శ్రీ ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం నందు రథసప్తమి వేడుకల్లో భాగంగా సంగీత గాత్రకచేరి అలరించింది. ప్రముఖ సంగీత విద్వాంసులు ఐ వి ఎల్ శాస్త్రి సంగీత సమితి నుండి పిఠాపురం సంగీత గురువులు ఆకొండి వెంకట్రావుశిష్యబృందంచే సోమవారం సాయంత్రం అలరించింది. అనంతరం సూరవరపు సురేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు సంగీత కళాకారులకు జ్ఞాపికలు అందించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్