పిఠాపురం సీఐ శ్రీనివాస్ ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికులు భద్రతపై ఆటో డ్రైవర్లతో స్థానిక ఉప్పాడ బస్టాండ్ లో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల పట్ల భద్రతగా వ్యవహరిస్తూ డ్రైవర్లందరూ లైసెన్సు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ తదితర పత్రాలను కలిగి ఉండాలన్నారు. ప్రమాదాలకు గురికాకుండా ట్రాఫిక్ నిబంధనలకు లోబడి డ్రైవింగ్ చేపట్టాలని తెలిపారు.