పిఠాపురం: బాక్సింగ్లో రాష్ట్ర స్థాయికి నలుగురి ఎంపిక

64చూసినవారు
పిఠాపురం: బాక్సింగ్లో రాష్ట్ర స్థాయికి నలుగురి ఎంపిక
పిఠాపురం ఆర్ఆర్బీహెన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం జిల్లా స్థాయి బాక్సింగ్ క్రీడా కారిణుల ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 10 మంది బాక్సర్లు హాజరు కాగా, నలుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికచేశారు. 48 కేజీల విభాగంలో కె. అక్షయ, 51 కేజీల విభాగంలో ఎం. రాజరాజేశ్వరి, 54 కేజీల విభాగంలో ఆర్ ఎన్ గంగాభవానీ, 80 ప్లస్ ఓపెన్ వెయిట్ కేటగిరిలో జె. ఐశ్వర్య సూర్యదీపిక అర్హత సాధించారు.

సంబంధిత పోస్ట్