పిఠాపురం మండలం ఎఫ్ కే పాలెంలో పాపిడిదొడ్డి చెరువులో ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించేందుకు సిద్ధమయ్యారు. అక్రమ తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. అయినా ఇటుకల బట్టీ వ్యాపారులు తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. శుక్రవారం పాపిడిదొడ్డి చెరువు వద్ద రైతులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన ద్వారా తమ నిరసనను తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలపై పవన్ కళ్యాణ్ స్పందించాలని అన్నారు.