విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనుంది. దానిలో భాగంగా పిఠాపురం నుండి ఆదివారం ఉదయం 30 బస్సులు 20 కార్లు బయలుదేరుతున్నట్లు హైందవ శంఖారావం పిఠాపురం కన్వీనర్ డి. వెంకటేశ్వరరావు తెలిపారు. హనుమాన్ చాలీసాతో మొదలుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ వద్ద విశ్వ హిందూ పరిషత్ మణికుమార్, ఆగంటి ప్రభాకర్, సత్యనారాయణ దత్త కాషాయ జెండా ఊపి ప్రారంభించారు.