డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి వరకూ నిబంధనలు పాటించకుండా మద్యం అమ్మకాలు జరిగాయని మధ్యపానం, మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మండిపడ్డారు. మద్యం విక్రయాలను వ్యతిరేకిస్తూ పిఠాపురం తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం అమలు కావాలని కోరారు. ప్రజల జీవితాలు నాశనం అవుతున్న ప్రభుత్వానికి 200కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని సంబర పడుతున్నారన్నారు.